part I - మనసు ఫౌండేషన్ ఎం.వి.రాయుడు గారితో ఇంటర్వ్యూ

Harshaneeyam - Un pódcast de Harshaneeyam

Podcast artwork

Categorías:

ఇంజనీరింగ్ డిగ్రీ , M.Sc through research , ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ సైన్స్ లో పూర్తి చేసిన ఎం. వి రాయుడు గారు, పవర్ ఎలక్ట్రానిక్స్ లో డాక్టరేట్ తీసుకున్నారు . మనసు ఫౌండేషన్ ని 2006 వ సంవత్సరం లో తన సోదరులైన డాక్టర్ గోపీచంద్ , డాక్టర్ చంద్ర మౌళి గార్లతో కలిసి స్థాపించారు.తెలుగులో ఇప్పటిదాకా ప్రచురితమైన అన్ని పుస్తకాలను డిజిటల్ ఆర్కైవింగ్ చేసి భద్రపరచాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న మనసు ఫౌండేషన్ , ఇప్పటి దాకా 55 లక్షల పేజీల తెలుగు సాహిత్యాన్ని తన డేటాబేస్ లో ఉంచింది. ఇంకో మూడేళ్లలో తన లక్ష్యాన్ని పూర్తి చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతోంది. ఎవరైనా సరే తమ వద్ద వున్న అరుదైన తెలుగు పుస్తకాల పేర్లను , మనసు ఫౌండేషన్ కి పంపిస్తే, అవి వారి డేటాబేస్ లో లేకపోతే , మీ నుంచి సేకరించి స్కాన్ చేసి , భద్ర పరిచి, మళ్ళీ పుస్తకాలను వెనక్కి పంపించడం జరుగుతుంది. కింద ఇచ్చిన లింక్ లో మనసు ఫౌండేషన్ కాంటాక్ట్ డీటెయిల్స్ మీరు చూడొచ్చు.ఇదేకాకుండా , తెలుగులో సుప్రసిద్ధులైన రచయితల సమగ్ర లభ్య రచనలను కూడా ప్రచురిస్తూ వస్తోంది. ఇందులో భాగంగా, గురజాడ, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి, శ్రీశ్రీ, కాళీపట్నం రామారావు, రావి శాస్త్రి, బీనా దేవి, జాషువా, ఎన్ వై పతంజలి, పఠాభి గార్ల సమగ్ర లభ్య రచనలను ప్రచురించింది. 2018 వ సంవత్సరం నించి, నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం - కనియంపాడు కేంద్రం గా, మనసు ఫౌండేషన్ డిజిటైజేషన్ సెంటర్ ను నడుపుతోంది.ఈ ఇంటర్వ్యూలో రాయుడు గారు, మనసు ఫౌండేషన్ స్థాపించడం గురించి, ఫౌండేషన్ ద్వారా జరిగే అనేక కార్య క్రమాల గురించి, సాహిత్య ప్రచురణ లో వచ్చిన మార్పుల గురించి వివరించడం జరిగింది.ఇంటర్వ్యూ లో మొదట - 'గురజాడ సమగ్ర రచనలు' ప్రాజెక్టు లో పనిచేస్తున్నప్పుడు రాయుడి గారితో తన అనుభవాలను రచయిత , చారిత్రక పరిశోధకులు నెల్లూరు సర్వోదయ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్ డాక్టర్. కాళిదాస్ పురుషోత్తం గారు మనతో పంచుకుంటారు.* ఈ ఇంటర్వ్యూ కి తమ సమయాన్ని ఇచ్చిన రాయుడు గారికి, ఎపిసోడ్లో ప్రసంగించిన కాళిదాస్ పురుషోత్తం గారికి , మనసు ఫౌండేషన్ గురించి వివరాలు అందించిన అనిల్ బత్తుల గారికి , ఛాయా మోహన్ గారికి హర్షణీయం కృతజ్ఞతలు.మనసు ఫౌండేషన్ వెబ్సైటు అడ్రస్ : http://www.manasufoundation.com/works/మనసు ఫౌండేషన్ ఇమెయిల్ - [email protected]ఆఫీసు అడ్రస్: MaNaSu FoundationKaniampadu VillageNear VarikuntapaduSPSR Nellore DistrictAndhra PradeshPIN Code : 524227https://goo.gl/maps/dTiBnbd7g842This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

Visit the podcast's native language site